రోడ్డెక్కిన రైలు ఇంజన్ - ఆసక్తిగా తిలకించిన జనం - Train Engine on Lorry In Anantapur
🎬 Watch Now: Feature Video
Train Engine on Lorry In Anantapur District : పట్టాలపై దూసుకెళ్లాల్సిన రైలు రోడ్డు ఎక్కడం ఏంటి అనుకుంటున్నారా ! అవునండీ రైలు రోడ్డెక్కింది. అయితే కాస్త ఆగండి. రోడ్డెక్కింది రైలు కాదు రైలింజన్ మాత్రమే. అదేనండి రైలింజన్‌ను లారీపై తరలిస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసీ అందరూ రైలు రోడ్డెక్కిందని అనుకుంటున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ 42వ జాతీయ రహదారిపై రైలు ఇంజన్‌ను లారీ తీసుకెళ్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి బళ్లారి రైల్వే జంక్షన్‌కు కొత్త రైలు ఇంజన్‌ను లారీ మీద తరలించారు. ఈ లారీ ఈ నెల 16న లారీ ఝాన్సీలో బయలుదేరినట్లుగా వాహన డ్రైవర్లు తెలిపారు. దీంతో గ్రామాల మీదుగా లారీ మీద వెళ్లడంతో రైలును చూడడానికి స్థానికులు ఎగబడ్డారు. కొంచెం కొత్తగా ఏది కనబడ్డా జనం అసక్తి కనబరుస్తారు. ఉరవకొండలో ఒకర్ని చూసి మరొకరు ఈ దృశ్యాన్ని చూసేందుకు అంతా ఒక్క దగ్గరు చేరి వీక్షించారు. రైళ్లపై లారీలు వెళ్లడం చూశాం కానీ లారీపై రైలింజన్ చూడడమే వింతే అంటున్నారు జనాలు.