LIVE : శాసనసభలో పద్దులపై వాడివేడి చర్చ - Telangana Assembly Live
🎬 Watch Now: Feature Video
Published : Jul 30, 2024, 10:09 AM IST
|Updated : Jul 30, 2024, 10:39 PM IST
Telangana Assembly Budget Session 2024 Live : తెలంగాణ శాసనసభ సమావేశాలు తిరిగి ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సమావేశాల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఈరోజు శాసనసభలో బడ్జెట్ పద్దులపై చివరిరోజు చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లు మంగళవారం శాసనసభ ముందుకు వచ్చింది. ఈ మేరకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (పబ్లిక్ - ప్రైవేట్ పార్టనర్ షిప్) బిల్లు 2024ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పద్దులపై శాసనసభలో మంగళవారం చివరి రోజు చర్చ జరగుతోంది. మంగళవారం మరో 19 పద్దులపై అసెంబ్లీలో చర్చ, మంత్రులు సమాధానం ఇస్తున్నారు. వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్అండ్బీ, పంచాయితీ రాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, పర్యాటకం, క్రీడలు, అటవీ, దేవాదాయ, చేనేత, ఐఅండ్పీఆర్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా-శిశు సంక్షేమ శాఖ పద్దులపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. మంగళవారం కూడా శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. అయితే శాసనసభ సమావేశానికి అరగంట పాటు విరామం ఇచ్చి అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు హాజరయ్యారు. అనంతరం తిరిగి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Last Updated : Jul 30, 2024, 10:39 PM IST