11 వేల మందితో తైక్వాండో ప్రదర్శన - దాసోహమన్న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ - Thwikando performance news
🎬 Watch Now: Feature Video


Published : Mar 3, 2024, 3:48 PM IST
Thwikando performance in India Book of Records In Nizamabad : నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో 11 వేల మందితో నిర్వహించిన తైక్వాండో ప్రదర్శన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. మహిళలు ఆత్మ రక్షణకు గత నెల రోజులుగా శిక్షణ తీసుకున్నారు. ఈ ప్రదర్శనలో వివిధ రంగాలకు చెందిన మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు, యువతులు పాల్గొన్నారు. మహిళలు చేసిన తైక్వాండో ప్రదర్శనకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం పట్ల జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత ఆనందం వ్యక్తం చేశారు. వివిధ రంగాలకు చెందిన మహిళలకు, స్కూల్ విద్యార్థులకు నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చామని కంచాల సునీత తెలిపారు.
Thwikando performance : అందరికీ ఒకే రోజు ఈ శిక్షణ పెట్టామని చెప్పారు. శనివారంతో 14 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చామన్న ఆమె, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆత్మ రక్షణ నేర్పించాలని సునీత కోరారు. విద్యార్థులు, మహిళలు ఎక్కడికెళ్లినా ధైర్యంగా ఉండేందుకు ఈ శిక్షణ తోడ్పడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.