టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు - మరో ముగ్గురు అరెస్ట్ - Attack on TDP Central Office - ATTACK ON TDP CENTRAL OFFICE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 10, 2024, 10:46 AM IST
Three People Arrested in Case of Attack on TDP Central Office : గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ అనుచరులని పోలీసుల దర్యాప్తులో తేలింది. కృష్ణలంకకు చెందిన పవన్ కుమార్, భాగ్యరాజ్, సుధాకర్‌గా గుర్తించారు. వీరిని న్యాయమూర్తి ముందు హాజరు పరుచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో వైఎస్సార్సీపీకి చెందిన మరో పది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేవినేని అవినాష్ ముందస్తు బెయిలు దాఖలు : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. అవినాష్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదించారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఇదే వ్యవహారంతో ముడిపడిన కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వేసిన బెయిలు పిటిషన్‌తో కలిపి ప్రస్తుత పిటిషన్లను బుధవారం విచారించాలని కోరారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.