ఇది చూశారా ! - ఒకే గదిలో మూడు అంగన్వాడీ కేంద్రాలు - గ్రామస్థుల ఆగ్రహం - Three Anganwadi schools in One Room - THREE ANGANWADI SCHOOLS IN ONE ROOM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 10:53 AM IST
Three Anganwadi Centers in One Room : విద్యకు పెద్దపీట వేశామని గొప్పలు చెప్పిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిన్నారులను ఆడిపాడించే అంగన్వాడీ కేంద్రాలను కట్టలేకపోయింది. ప్రతి గ్రామంలో సచివాలయం, ఆర్బీకేలు నిర్మించామని, గ్రామాల రూపురేఖలు మార్చేశామని జగన్ గొప్పలు చెప్పారని, కానీ మా గ్రామంలో చిన్న పిల్లలు ఉండేందుకు అంగన్వాడీ బడులు నిర్మించలేకపోయారని గ్రామస్థులు అంటున్నారు. ఇందుకు నిదర్శనం శ్రీకాకుళం జిల్లా లావేరు మండల కేంద్రంలోని దుస్థితి.
ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఒకే చోట ఒకే గదిలో మూడు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ముగ్గురు కార్యకర్తలు, ముగ్గురు ఆయాలు, పిల్లలకు వచ్చే సరకులు, ఆట వస్తువులు, సిలిండర్లు, గ్యాస్ పొయ్యిలు, రికార్డులు అన్నీ అందులోనే. ఫలితంగా చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత మూడు సంవత్సరాలుగా ఇదే దుస్థితి నెలకొంది. గ్యాస్ బండలు అక్కడే ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటో అధికారులకే తెలియదా అని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దెకు భవనాలు దొరక్క ఒకే గదిలో కేంద్రాలు నిర్వహిస్తున్నామని, కొత్త భవనం పనులు దాదాపు 90 శాతం పూర్తయిందని, మిగిలినవి జరిగితే అందులోకి తరలిస్తామని ప్రాజెక్టు సీడీపీవో ఝాన్సీబాయ్ తెలిపారు.