రెచ్చిపోయిన దొంగలు - పొలంలోకి వెళ్లి మరీ మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ - GOLD CHAIN STOLEN FROM WOMAN - GOLD CHAIN STOLEN FROM WOMAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2024, 5:20 PM IST
Thief Stolen Gold Chain from Woman at Farm : రోజురోజుకూ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు బస్సు, రైళ్లు, ఇళ్లలో దొంగతనాలు చేయటం చుశాం. కానీ ఏకంగా రైతుల పొలాల్లోకి వచ్చి దొంగతనం చేయటం ఎక్కడైనా చూశాారా? అవును పట్టపగలు పొలంలో పశువులు మేపుతున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు, చెవి కమ్మలు దొంగలించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రొల్ల మండలం బి.జి హళ్లి గ్రామానికి చెందిన తిమ్మమ్మ అనే మహిళ ఈరోజు (శుక్రవారం) పశువులను మేపడానికి పొలానికి వెళ్లింది.
కొంతసేపటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తిమ్మమ్మపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న గోల్డ్ చైన్, చెవి కమ్మలను బలవంతంగా లాక్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు చెవి కమ్మలను బలవంతంగా లాగడంతో తిమ్మమ్మ చెవి వద్ద తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో కాపాడండి అంటూ మహిళ గట్టిగా కేకలు వేయడంతో సమీప పొలాల్లో ఉన్న రైతులు అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం ఆమెను మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.