అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బ్రిడ్జి నిర్మాణంపై ప్రపంచ బ్యాంక్ అధికారుల ఆరా - World Bank Team in Konaseema - WORLD BANK TEAM IN KONASEEMA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2024, 5:39 PM IST

World Bank Team in Konaseema: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో గోదావరి మధ్యలో ఉన్న నాలుగు లంక గ్రామాల ప్రజల కోసం జి.పెదపూడి లంక వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం పరిశీలించడానికి నేరుగా రంగంలోకి దిగింది. ఈ వంతెన నిర్మాణం అనేది ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనదిగా భావించవచ్చు.

పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని అధికారుల వెల్లడి: బృందప్రతినిధుల సభ్యులు అంతా ఆయా లంక గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం గుత్తేదారులకు సుమారుగా 600 కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్​లో ఉంచిందని తెలిపారు. దీనిని కూటమి ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ చీఫ్ ఇంజినీర్ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. సుమారుగా నెల రోజుల కాల వ్యవధిలో బిల్లుల చెల్లింపు జరుగుతుందని ఆయన ధీమాగా వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.