అవాక్కయ్యారా? - నేను చనిపోలే జస్ట్ 5 గంటలు అలా నిద్రపోయానంతే!! - Man Lying in Pond In Hanamkonda - MAN LYING IN POND IN HANAMKONDA
🎬 Watch Now: Feature Video
Published : Jun 11, 2024, 11:41 AM IST
|Updated : Jun 11, 2024, 11:58 AM IST
Man Sleeping in Pond in Hanamkonda : హనుమకొండలో ఒక వ్యక్తి చేసిన పనికి పోలీసులు షాక్ అయ్యారు. హనుమకొండలోని రెండవ డివిజన్ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి సోమవారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపుగా ఐదు గంటల పాటు నీటిలో నిద్రపోయాడు. అటుాగ వెళ్తున్న స్థానికులు నీళ్లలో ఓ మనిషి కనిపించడం చూసి చనిపోయాడని భావించారు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, 108 సిబ్బంది కూడా అతడు మరణించాడని అనుకున్నారు. మృతదేహం అనుకుని నీళ్లలో నుంచి వెలికి తీయడానికి ఓ పోలీసు అధికారి ఆ వ్యక్తి చేతులు పట్టుకుని లాగాడు. అలా ఒక్కసారిగా నీళ్లలో నుంచి ఆ వ్యక్తిని బయటకు తీస్తుండగా అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు. ఇది చూసి సదరు అధికారి ఒక్కసారిగా కంగుతిన్నారు. చనిపోయాడనుకుంటే ఒక్కసారిగా లేచి కూర్చోవడంతో షాకయ్యారు. ఎందుకు ఇలా పడుకున్నావ్ అని అడగ్గా తాను గ్రానైట్ క్వారీలో పని చేస్తానని, ఒళ్లంతా వేడిగా మంటగా అనిపించడంతో చల్లగా ఉంటుందని అలా నీటిలోకి దిగానని, అలాగే నిద్రపోయానని చెప్పుకొచ్చాడు. ఇది విన్న పోలీసులు ఒకింత అసహనానికి గురైనా అతడి సమాధానం విని నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.