హైదరాబాద్‌లో 'ఓన్ యువర్ బాడీ' బుక్ ఆవిష్కరణ - Own Your body Book Released - OWN YOUR BODY BOOK RELEASED
🎬 Watch Now: Feature Video


Published : Jul 1, 2024, 9:38 AM IST
Own Your body Book Released in Hyderabad : గృహిణులే మంచి డాక్టర్లు, అని మన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించేది వారేనని ప్రముఖ వైద్యులు శివ్ సెరిన్ అన్నారు. హైదరాబాద్‌లోని షేర్టాన్ హోటల్‌లో కాంటినెంటల్ హస్పిటల్ ఆధ్వర్యంలో కాలేయం వ్యాధి వైద్యులు శివ్ సెరిన్ రచించిన "ఓన్ యువర్ బాడీ" బుక్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లో ఉంటుందని దానికి అనుగుణంగా శరీరాన్ని తయారు చేసుకోవాలని సూచించారు.
ఫ్యాటీ లివర్‌ను అదుపులో ఉంచుకోవాలని లేకపోతే అది పెరిగితే హార్మోన్ల సమతుల్యం లోపించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మొదటి వైద్యురాలి తల్లి అని చెప్పారు. అనంతరం కాంటినెంటల్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్ట్‌ర్ ఎన్.రెడ్డి మాట్లాడారు. సౌత్ ఇండియాలో శివ్ సెరిన్ పుస్తకం ఆవిష్కణ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆ పుస్తకంలో వివరించారని పేర్కొన్నారు.