'ఐదేళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు- మరోసారి జగన్కు ఓటేస్తే ఉరి వేసుకోవాల్సిందే' - Electric Charges Hike in ycp govt - ELECTRIC CHARGES HIKE IN YCP GOVT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 21, 2024, 9:40 PM IST
Telugu Youth State General Secretary Ravi Naidu Fires On CM Jagan : జగన్ పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు విమర్శించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని ఆరోపించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు ఏ అర్హత ఉందని ప్రజల్లో తిరుగుతున్నారని ప్రశ్నించారు. అసలు వారికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులు ఉరివేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు.
వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే కరెంట్ బిల్లులతో ఉరివేసుకోవాల్సిందేనని తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై సామాన్య ప్రజలకు సీఎం సమాధానం చెపుతారని డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఉచిత విద్యుత్ ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. గ్రామాల్లో విద్యుత్ కోతలు మొదలైయ్యాయని ఆరోపించారు. జగన్ అసమర్థుడు కాబట్టే రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. గులకరాయి తగిలితే సానుభూతి కోసం తలకు బ్యాండేజ్ వేసుకుని రాజకీయాలు చేస్తున్నాడన్నారు. విద్యావ్యవస్థను నాశనం చేశారని ప్రశ్నిస్తే ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేయించారని రవి నాయుడు మండిపడ్డారు.