బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అబద్ధం : తెల్లం వెంకట్రావు - TellamGives Clarity On Party Change - TELLAMGIVES CLARITY ON PARTY CHANGE
🎬 Watch Now: Feature Video
Published : Jul 31, 2024, 8:41 PM IST
Tellam Venkat Rao Gives Clarity On Party Change : తాను బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు స్పష్టం చేశారు. నియోజక వర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. అదే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను తప్పితే మళ్లీ పార్టీ మారడం జరగదని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. తనపై వస్తున్న వదంతులను ప్రజలు ఎవరు నమ్మొద్దన్నారు.
బీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ లాబీలో తనకు ఎదురుపడ్డ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా పలకరించానని తెలిపారు. భద్రాచలం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని తెలిపారు. మంగళవారం కేసీఆర్‌కు కేటాయించిన చాంబర్‌కు తెల్లం వెళ్లారు. దీంతో ఆయన తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నాడని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేశాయి. అయితే దీన్ని తెల్లం ఖండించారు.