LIVE : తెలంగాణ శాసనమండలి సమావేశాలు - tg legislative council sessions - TG LEGISLATIVE COUNCIL SESSIONS
🎬 Watch Now: Feature Video
Published : Jul 25, 2024, 1:13 PM IST
|Updated : Jul 25, 2024, 1:39 PM IST
Telangana Legislative Council : తెలంగాణ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రశ్నోత్తరాలు, కొన్ని టేబుల్ అంశాలపై సభలో చర్చించారు. అలాగే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ మృతిపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాప తీర్మానం చదివి వినిపించారు. రెండో రోజు తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడుతున్నారు. శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అంతకుముందు మంత్రిమండలి బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగం, సంక్షేమం, అభివృద్ధికి అధిక మొత్తం నిధులు కేటాయించారు. ఇవాళ సభ అనంతరం రేపు మండలికి సెలవు ఇవ్వనున్నారు. మళ్లీ 27న శనివారం బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. 28 ,29, 30 తేదీల్లో సమావేశాలకు సెలవు. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు.
Last Updated : Jul 25, 2024, 1:39 PM IST