ప్రజాభవన్ ముందు ప్రభుత్వ గురుకులాల ఉద్యోగుల ధర్నా - ప్రజాభవన్ గురుకులాల ఉద్యోగుల ధర్నా
🎬 Watch Now: Feature Video
Published : Feb 13, 2024, 3:17 PM IST
Telangana Gurukul Teachers Protest In Prajabavan : జేఏసీ డిమాండ్లను పట్టించుకోకుండా ప్రభుత్వం గురుకుల పోస్టుల భర్తీ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ గురుకులాల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆందోళన బాటపట్టాయి. హైదరాబాద్‌లోని పూలే ప్రజాభవన్ ముందు ప్రభుత్వ నిరసన తెలిపాయి. ప్రమోషన్లు, బదిలీలు చేపట్టిన తరువాతే గురుకుల పోస్టుల భర్తీ చేపట్టాలని వారంతా డిమాండ్ చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని వెంటనే సమస్యలను పరిష్కరించాలంటూ పూలే ప్రజాభవన్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గురుకుల టీచర్స్ యూనియన్ లీడర్స్‌తో మాట్లాడి వారి సమస్యలను త్వరలో తీరుస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు.
"ప్రమోషన్లు కల్పించకుండా రిక్రూట్‌మెంట్ చేపట్టడం వల్ల చాలా సర్వీస్ కలిగి ఉన్నప్పటికీ కొత్తగా నియమితులైన వారికంటే జూనియర్లుగా మారే ప్రమాదం ఉంది. సుదీర్ఘకాలంగా గురుకులాల్లో బదిలీలు చేపట్టకపోవడంతో మారుమూల ప్రాంతాల్లో అనేక మంది సీనియర్లు పనిచేయాల్సి వస్తోంది. ప్రమోషన్లు, బదిలీల తర్వాతే నియామకాలు చేపట్టాలి" అని గురుకుల టీచర్స్ యూనియన్ లీడర్స్ కోరారు