'అన్నా చెల్లెలు ఒకరికొకరు రాఖీ కట్టుకోవడమే కాదు - ఇద్దరు కలిసి దేశానికి రక్షగా ఉండాలి' - Rakhi Celebration iN hYDERABAD - RAKHI CELEBRATION IN HYDERABAD
🎬 Watch Now: Feature Video
Published : Aug 18, 2024, 5:32 PM IST
Telangana Governor participated Raksha Bandhan Celebration : రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెలు ఒకరికొకరు రక్షణ మాత్రమే కాకుండా, ఇద్దరు కలిసి దేశానికి రక్షగా ఉండాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. సురక్ష రాఖీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉప్పల్ మినీ శిల్పారామంలో జరిగిన రాఖీ పండుగ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేటర్లు గవర్నర్కు రాఖీ కట్టారు. ఎంత స్థాయికి వెళ్లినా మాతృభూమి రుణం తీర్చుకోలేనిదని, దేశ రక్షణకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణ ప్రజలందరికీ గవర్నర్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్తో పాటు ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మోదీ ప్రధాని కాకముందు దేశం పేద దేశంగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు. ప్రపంచంలో మనం ఒకప్పుడు ధాన్యం దిగుమతి చేసుకున్నామని, ఇప్పుడు ఏ దేశానికి ఆకలి ఉన్నా మన నుంచి ధాన్యం వెళుతుందని గుర్తు చేశారు. భారత్ ఎదుగుదల ఆపేందుకు ఎవరెన్ని కుట్రలు చేసినా, భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.