పదేళ్లలో మోదీ తెలంగాణకు ఇచ్చిన నిధులపై దమ్ముంటే రేవంత్ చర్చకు రావాలి : కిషన్రెడ్డి - Kishan Reddy Fires On Congress - KISHAN REDDY FIRES ON CONGRESS
🎬 Watch Now: Feature Video
Published : May 1, 2024, 7:28 PM IST
Kishan Reddy Fires on CM Revanth : తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గాడిదలతో కూడా గుడ్లు పెట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. గాడిదలు గుడ్లు పెడతాయా అని ప్రశ్నించారు. నిన్న రాజ్యాంగం అన్న రేవంత్ రెడ్డి ఇవాళ గాడిద గుడ్డును పట్టుకుని ఊరేగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ పెత్తనానికి పోటీ అంటున్న సీఎం, రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
BJP Election Campaign in Telangana : గుజరాత్ పెత్తనం అవసరం లేదని కాంగ్రెస్ కుటుంబ పాలనను అడ్డుకోవడానికి తాము ఉన్నామన్నారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో సూట్కేసులు దిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. ఫేక్ వీడియోలు సృష్టించడంలో మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డినేనన్నారు. ఫేక్ వీడియోలు సృష్టించడం వెనక ఎవరున్నా వదిలిపెట్టేదిలేదని జైళ్లో వేసి ఊసలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించారు. 17పార్లమెంట్ సీట్లలో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో మోదీ తెలంగాణకు ఇచ్చిన నిధులపై దమ్ముంటే సీఎం చర్చకు రావాలని సవాల్ విసిరారు.