LIVE : తెలంగాణ శాసనసభ సమావేశాలు - Telangana Assembly Session Live
🎬 Watch Now: Feature Video
Published : Aug 2, 2024, 10:12 AM IST
|Updated : Aug 2, 2024, 8:09 PM IST
Telangana Assembly Session Live : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. సభలో మూడు బిల్లులపై చర్చ జరుగుతోంది. అందులో సివిల్ కోర్టుల సవరణ బిల్లు, తెలంగాణ చట్టాల బిల్లు, పబ్లిక్ సర్వీస్ నియామకాలు నియంత్రణ బిల్లులు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెట్టింది. ధరణి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భూమి హక్కులు సంస్కరణలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. అలాగే ఇవాళ శాసనసభలో జాబ్ క్యాలెండర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటిస్తారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్ధత తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. శాసనసభలో గురువారం హైదరాబాద్ మెట్రో సిటీ సుస్థిర పట్టణాభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జులై 23 నుంచి ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశం తొలిరోజు సమావేశం తర్వాత బీఏసీ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 2 వరకు సమావేశాలు జరగాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Last Updated : Aug 2, 2024, 8:09 PM IST