LIVE : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - Telangana Assembly Sessions live - TELANGANA ASSEMBLY SESSIONS LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 11:05 AM IST

Updated : Jul 23, 2024, 11:51 AM IST

Telangana Assembly Sessions 2024 Live : రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్​ సమావేశాలను ప్రభుత్వం సుమారు 7-10 రోజుల పాటు నిర్వహించనున్నారు. ముందుగా సభలో సీఎం రేవంత్​ రెడ్డి కంటోన్మెంట్​ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నారు. అనంతరం శాసనసభ వాయిదా పడనుంది. శాసనసభ ముగిసిన అనంతరం బిజినెస్​ ఎడ్వైజరీ కమిటీ సమావేశాన్ని స్పీకర్​ సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్​ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలు, ఎజెండా బీఎస్సీలో ఖరారు చేయనున్నారు. ఈనెల 25న ఉదయం 9 గంటలకు సీఎం అధ్యక్షతను క్యాబినెట్​ సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 25న అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఈ శాసనసభ సమావేశాల్లోనే జాబ్​ గ్యారంటీపై ప్రకటన, పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉంది.
Last Updated : Jul 23, 2024, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.