LIVE : తెలంగాణ శాసనసభ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - Assembly Sessions 2024 Live
🎬 Watch Now: Feature Video
Published : Feb 17, 2024, 10:08 AM IST
|Updated : Feb 17, 2024, 8:07 PM IST
Telangana Assembly Sessions 2024 Live : తెలంగాణ శాసనసభ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. నీటిపారుదల రంగంపై నేడు శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. దీనిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చజరగనుంది. ఈ నెల 8 నుంచి మొదలయిన సమావేశాలు వాడీ వేడీగా నాయకుల మధ్య వాదనలు జరిగాయి. మొదటిగా గవర్నర్ ప్రసంగాన్ని ప్రవేశపెట్టగా, దానిపై చర్చ జరిగిన అనంతరం సభ ఆమోద ముద్ర వేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్‌ను నాలుగు నెలల కాల పరిమితికి సభలో ప్రవేశపెట్టింది. దీనిపై సుదీర్ఘంగా చర్చ కొనసాగుతోంది. ఇవాళ్టితో ముగియనుంది. ప్రధానంగా సాగునీటి పారుదల శాఖపై చర్చ జరిగింది. అలానే కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కూడా చర్చ జరిగింది. చివరి రోజు బీసీ కులగణనపై సభలో ప్రభుత్వం తీర్మానం పెడుతోంది. అలానే బీసీ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం సభ వాయిదా పడింది. మళ్లీ మొదలైన తరువాత ప్రస్తుతం ఇతర అంశాలపై చర్చ జరుగుతోంది.