న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలి: బహుజన టీచర్ల సంఘం - బహుజన టీచర్ల సంఘం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 5:47 PM IST
Teachers Union Agitation in Vijayawada : సీఎం జగన్ మోహన్ రెడ్డి సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేస్తేనే తమను ఓట్లు అడిగేందుకు రావాలని బహుజన టీచర్ల సంఘం నాయకులు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మాటలను నమ్మి ఓట్లు వేసి గెలిపించుకుంటే తమల్ని నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. విజయవాడలో బహుజన టీచర్స్ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో 117 రద్దు చేయటం వల్ల కొన్ని వేల టీచర్లు పోస్టులు కోల్పోయామని టీచర్స్ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తిరిగి పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వం రకరకాల యాప్‌ల పేరుతో ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తుందని వాపోయారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయులను అందరూ కలిసి జగన్ గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.