'క్విజ్ పోటీలో పాల్గొనను' - చితకబాదిన ఉపాధ్యాయుడు - చావుదెబ్బలు కొట్టిన ఉపాధ్యాయుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 12:06 PM IST

Teacher Brutually Beats Student in Kadapa: ఆరో తరగతి చదివే విద్యార్థిని ఉపాధ్యాయుడు చావు దెబ్బలు కొట్టాడు. ఉపాధ్యాయుడి దెబ్బలకు బాలుడి చర్మం కమిలి వాతలు తేలాయి. దీంతో కుటుంబ సభ్యులు విద్యార్థిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇలా విద్యార్థులను కొట్టడం ఎంతవరకూ సబబు అని తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని ప్రశ్నిస్తే తాను ఇంకా తక్కువ కొట్టానని ఇతర పాఠశాలలో ఇంతకంటే ఎక్కువగా కొడతారని సమాధానం చెప్పడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం కడప శివారులోని రామకృష్ణ నగర్​లో ఉర్దూ పాఠశాలలో మహమ్మద్ సోహెల్ ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో క్విజ్ పోటీలు నిర్వహించారు. కానీ సోహెల్ తాను క్విజ్ పోటీలో పాల్గొనలేనని ఉపాధ్యాయుడితో చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉన్న ప్లాస్టిక్ క్రికెట్ స్టాంపు తీసుకుని విద్యార్థి చేతులు, తొడలపై బలంగా కొట్టాడు. దీంతో బాలుడి ఒంటిపై వాతలు తేలాయి. కేవలం క్విజ్ పోటీలలో పాల్గొనలేనని చెప్పిన పాపానికి విద్యార్థిని కొట్టడం తగదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.