కత్తులు, గునపాలతో దాడులు చేసుకున్న టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు - tdp ysrcp activists clash - TDP YSRCP ACTIVISTS CLASH
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 12, 2024, 8:11 AM IST
TDP YSRCP Activists Clash: ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. చిన్నిళ్లుగారిపల్లెలో ఒకరిపై ఒకరు కత్తులు, గునపాలతో దాడి చేసుకున్నారు. దాడిలో ఇద్దరు టీడీపీ, నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
టీడీపీ, వైసీపీ నేతలు ఆస్పత్రి వద్ద మరోసారి ఘర్షణ పడ్డారు. గాయపడినవారిని పరామర్శించటానికి వచ్చిన టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఆసుపత్రికి వద్ద మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని తరిమికొట్టారు. ఇరుపార్టీ నాయకులను ఆసుపత్రి పరిసరాల నుంచి పంపిచేశారు. ఓటుకు డబ్బులు పంపిణీ చేసే విషయంలో ఘర్షణ నెలకొన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.