ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం - లండన్‌లో టీడీపీ అభిమానుల ఉత్సవాలు - TDP Followers Celebrations in London - TDP FOLLOWERS CELEBRATIONS IN LONDON
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 4, 2024, 4:25 PM IST
TDP Followers Celebrations in London : కూటమి విజయం సాధించటంతో కార్యకర్తలు సంబరాలు హోరెత్తాయి. అన్ని ప్రాంతాల్లో బాణసంచా కాలుస్తూ విజయోత్సాహంలో మునిగి తెలుతున్నారు. కేకులు కోసి స్వీట్లు తినిపించుకున్నారు. నృత్యాలు చేస్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కూటమి భారీ విజయం సాధించటంతో తెలుగుదేశం కార్యకర్తల సంబరాలు ఎల్లలు దాటాయి. చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుండడంతో లండన్‌లో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం ఉత్సహం ఎగిసిపడింది. టీడీపీ నేత జయకుమార్ నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు టీడీపీ పార్టీ జెండాలు చేత పట్టుకుని జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
కూటమి విజయంతో హైదరాబాద్‌లోని జనసేన నేతల సంబురాలు మిన్నంటాయి. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విజయం సాధించడంతో హైదరాబాద్‌లోని జనసేన కార్యక్రమంలో కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తూ నినాదాలు చేశారు.