'కూటమి ప్రభుత్వం పట్ల ప్రజాదరణను ఓర్వలేక వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారాలు' - YSRCP False Propaganda on tdp - YSRCP FALSE PROPAGANDA ON TDP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 18, 2024, 4:06 PM IST
TDP State Spokesperson Mahasena Rajesh Fires On YSRCP False Propaganda : రాష్ట్రంలో జరిగే ప్రతీ హత్యకు, అత్యాచారానికి టీడీపీ ప్రభుత్వమే కారణమంటూ వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే దిశగా సీఎం చంద్రబాబు సహా నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు. విదేశాల్లో నరకం అనుభవిస్తున్న యువకులకు విముక్తి కల్పించడం, ఒక్క వ్యక్తే కదా అని నిర్లక్ష్యం చేయకుండా కువైట్లోని వ్యక్తిని స్వదేశానికి తీసుకురావడంలో మన నేతల నిబద్ధత కనిపిస్తుందని అన్నారు.
వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హత్యలు, అరాచకాలంటూ అబద్దాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీని శ్మశానం చేయడానికే వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారానికి పూనుకుందని విమర్శించారు. వైఎస్సార్సీపీ హయాంలో 600 మంది ఎస్సీ, బీసీ, మైనార్టీలను చంపారని ఆరోపించారు. నేడు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారన్నారు. ప్రజల్లో కూటమిపై వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని రాజేష్ మండిపడ్డారు.