'జగన్‌కు అధికార పిచ్చి - అందుకే రాష్ట్రపతి పాలన కోరుతున్నారు' - Kotam reddy criticized ys Jagan
🎬 Watch Now: Feature Video
TDP State General Secretary Kotamreddy Srinivasulu Criticized Jagan : మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికార పిచ్చితోనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ పాలనలో హత్య రాజకీయాలు చేసిన జగన్ ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కొంత మంది వ్యక్తిగతంగా దాడులు చేసుకున్నా అధికార పార్టీపై నెట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే రాష్ట్రంలో దళితులపై లెక్కలేనన్ని దాడులు, అత్యాచారాలు జరిగాయని చెప్పారు. ఇప్పుడు సామాజిక బస్సు యాత్ర చేస్తానని జగన్ అనటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. అసలు ఏం అర్హతతో యాత్ర చేస్తారని నిలదీశారు?
జెడ్ ప్లస్ భద్రత ఉన్నా.. ఇంకా జగన్ కు అభద్రత ఎందుకని ప్రశ్నించారు. ఇప్పుడు జగన్‌కు 58 మంది భద్రతతో పాటు 2ఎస్కార్ట్ బృందాలు, 10మంది సాయుధ గార్డుల భద్రతతో పాటు కాన్వాయ్‌లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బులెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయిని వెల్లడించారు. ఇవి సరిపోవు అన్నట్లు ఇంకా 986 మందితో భద్రత ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. రక్షణ పెంచాలని కోరుతున్న జగన్‌కు చంచల్ గూడ జైలు ఒక్కటే రక్షణ కల్పిస్తుందని కోటంరెడ్డి శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.