LIVE: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Palla Srinivasa Rao Press Meet - PALLA SRINIVASA RAO PRESS MEET

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 1:03 PM IST

Updated : Jun 30, 2024, 1:19 PM IST

Palla Srinivasa Rao Media Conference: టీడీపీ సంక్షేమ అందిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 1వ తేదీన అమరావతి పరిధిలోని తాడేపల్లి మండలం పెనుమాకలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. చంద్రబాబు స్వయంగా పింఛన్​ లబ్ధిదారులకు నగదు అందించనున్నారు. ఉదయం 6 గంటలకే పింఛన్‌దారులకు పాత బకాయిలతో కలిపి మొత్తం 7 వేల రూపాయల నగదు అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65 లక్షల 18 వేల 496 మంది లబ్దిదారులకు 4 వేల 408 కోట్ల రూపాయలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పెంచిన ఫించన్‌ వెయ్యి రూపాయలు కలిపి 4 వేల రూపాయలు అందజేస్తున్నారు. అలాగే ఏప్రిల్ నుంచే ఇస్తామన్న హామీ మేరకు ఆ మూడు నెలలు బకాయిలు కూడా ఇస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. దివ్యాంగులకు ఒకేసారి 3 వేలు పెంచామని, జులై నుంచి 6 వేల చొప్పున పెంచిన పింఛన్ అందజేయనున్నారు. సంక్షేమ పాలన అంటే తెలుగుదేశం పార్టీ అని ల్లా శ్రీనివాసరావు అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : Jun 30, 2024, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.