LIVE: ఎంపీ గల్లా జయదేవ్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - undefined
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 10:31 AM IST
|Updated : Jan 28, 2024, 11:11 AM IST
Guntur MP Galla Jayadev Live: ఎంపీగా నా వంతు కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నానని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై లేవనెత్తుతున్నారన్నారు. తన తాత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. తన తాతకు 55 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందని, మా అమ్మ కూడా ప్రజా సేవ కోసం అమెరికా నుంచి తిరిగి వచ్చినట్లు వెల్లడించారు. అమ్మ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించినట్లు, ప్రజలకు సేవ చేసేందుకు నేను కూడా అమెరికా నుంచి తిరిగి వచ్చానని స్పష్టం చేశారు. చాలా మంది వివిధ రంగాల్లో ఉంటూ రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారన్నారు. వైద్యులు, రైతులు వివిధ వృత్తుల వారు రాజకీయాల్లో ఉన్నారన్నారు. అదే విధంగా తాను కూడా వ్యాపారిగా, రాజకీయ నాయకుడిగా రాణిస్తున్నట్లుగా వెల్లడించారు. రాజకీయాలకు ముందు వ్యాపార అనుభవం ఉందని తెలిపారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మరిన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు - ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం.
TAGGED:
MP GALLA JAYADEV LIVE