ప్రజల వద్దకు పోలేక సీఎం జగన్ మొహం చాటేస్తున్నారు: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి - ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 3:51 PM IST
TDP MLC Bhumireddy: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో గెలుపుపై నమ్మకం కోల్పోయారని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఇంతటీ దీన స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారారని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని తెలిపారు. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు నివాళులర్పించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలను 100 రోజులు జరపాలి, 150 రోజులు జరపాలని జగన్ డిమాండ్ చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి గుర్తు చేశారు. అలాంటిది జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఒక రోజు, రెండు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ప్రతిపక్షనేతలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ సభను ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ విఫలమై ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ప్రజల వద్దకు పోలేక మొహం చాటేస్తున్నారని ఎమ్మెల్యీ భూమిరెడ్డి విమర్శించారు.