గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి లేఖ - MLC Ramgopal Reddy on Group 2 Mains - MLC RAMGOPAL REDDY ON GROUP 2 MAINS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 5:15 PM IST
MLC Ramgopal Reddy Letter to APPSC Chairman : కొత్తగా రూపొందించిన సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని, గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జులై 28న జరగబోయే ఈ పరీక్షలకు అభ్యర్థులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన వినతి పత్రం అందజేశారు. ఎగ్జామ్ కోసం కొత్త సిలబస్‌ను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి అభ్యర్థులకు ముఖ్యమైన సవాల్‌గా ఉందని భూమిరెడ్డి పేర్కొన్నారు.
APPSC Group-2 Mains Exam 2024 : పరీక్షల షెడ్యూల్లో స్వల్పంగా సర్దుబాటు చేయడం వల్ల, అభ్యర్థులు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించడమే కాకుండా పరీక్షా ప్రక్రియ యొక్క సమగ్రత, నిష్పాక్షికతను కూడా సమర్థిస్తుందని భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి చెప్పారు. ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 10న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై కాగా 2557 మంది అభ్యర్థుల్ని వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారు. రాష్ట్రంలో మొత్తం 899 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 21 నుంచి జనవరి 17 వరకు కమిషన్ దరఖాస్తులను స్వీకరించింది.