ఉద్యోగులను మోసగించిన జగన్ను ఇంటికి పంపాలి: ఎమ్మెల్సీ అశోక్‌బాబు - MLC Ashokbabu on Postal Ballot - MLC ASHOKBABU ON POSTAL BALLOT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 2, 2024, 2:22 PM IST
TDP MLC Ashokbabu on Employees Postal Ballot Voting: వైఎస్సార్సీపీ పాలనలో ఉద్యోగులకు గౌరవం లేదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులేనని అన్నారు. కూపన్లు, గిఫ్ట్లు ఇచ్చి ఉద్యోగులను మరోసారి ప్రలోభ పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యోగుల ఓట్ల కోసం జగన్ రెడ్డి కుయుక్తులు మొదలెట్టారని దుయ్యబట్టారు. రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులను జగన్ రెడ్డి నిండా ముంచాడని అశోక్‌బాబు ఆరోపించారు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన జగన్ రెడ్డికి నేడు ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు.
టీడీపీ పాలనలోనే ఉద్యోగులకు మేలు జరిగిందని, గౌరవం దక్కిందని అన్నారు. నేడు రాష్ట్రంలో 5లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉద్యోగులు సద్వినియోగం చేసుకుని జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులను మోసగించిన జగన్ను ఇంటికి పంపాలని అశోక్‌బాబు పిలుపునిచ్చారు.