ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది - ఎన్నికల ప్రచారంలో కొలికపూడి - Kolikapudi Election Campaign - KOLIKAPUDI ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 12:03 PM IST
TDP MLA Candidate Kolikapudi Srinivasarao Election Campaign: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు 20వ వార్డు రాజుపేటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఆంజనేయ స్వామి గుడిలో కొలికపూడి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మే డే సందర్భంగా జనసేన పార్టీ ఏర్పాటు చేసిన అల్పాహార శిబిరాన్ని ప్రారంభించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. కొలికపూడికి మద్దతుగా అమరావతి జేఏసీ నేతలు వార్డులో ఇంటింటికీ తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని, పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఇటీవలే జిల్లాలో లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో, పూలమాలలతో, యువత బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో రెండు నెలల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కొలికపూడి ఆశాభావం వ్యక్తం చేశారు.