ETV Bharat / state

గ్రామాలకు కొత్త కళ - ఈసారి సిమెంట్ రోడ్లపైనే సంక్రాంతి ముగ్గులు - GOVERNMENT FOCUS ON ROADS

పల్లెలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ‘పల్లె పండుగ’ - రహదారి లేని గ్రామాల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం

Government Focus On Road Maintenance And Construction
Government Focus On Road Maintenance And Construction (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2025, 7:30 AM IST

Government Focus On Road Maintenance And Construction : వైఎస్సార్సీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రహదారుల నిర్వహణ, నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యానికి నోచుకుని గ్రామాల రూపురేఖల్ని మార్చేస్తోంది. సంక్రాంతికి ముందే పల్లెల్లో అసలైన పండుగ వాతావరణం తెస్తోంది. సీసీ, బీటీ రోడ్లతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రామాలు నూతన శోభ సంతరించుకుంటున్నాయి.

గత ఐదేళ్లు నిధులు లేమితో కునారిల్లిన గ్రామాలకు కూటమి ప్రభుత్వం రాకతో కొత్త కళ వచ్చింది. సంక్రాంతి వేళ పల్లెలు మౌలిక వసతులతో ముస్తాబవుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారు. ‘మా పంచాయతీ నిధులు మాకివ్వండి..!’ అంటూ సర్పంచులు భిక్షాటనలతో నిరసనలు సైతం తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. పంచాయతీల నిధులను వాటి ఖాతాలకే జమ చేస్తున్నారు. అదనంగా ఉపాధి హామీ నిధులను జోడిస్తున్నారు. ఒకే రోజున అన్నిచోట్లా గ్రామ సభలు నిర్వహించి ఏయే పనులు చేయాలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, మురుగు కాలువలు, బీటీ రోడ్ల పనులను మొదలుపెట్టారు. దశాబ్దాలుగా రోడ్డును చూడని గ్రామాలన్నింటికీ సీసీ, బీటీ రోడ్లను అందుబాటులోకి తెస్తున్నారు.

ఆ దారిలో ఎన్ని గండాలో - అమ్మవారి దగ్గరికి వెళ్లాలంటేనే హడలిపోతున్న జనం

మారుతున్న గ్రామాల రూపురేఖలు : గుంటూరు జిల్లాలో సిమెంట్‌ రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. తాడికొండ నియోజకవర్గంలో రూ.5 కోట్లతో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మేడికొండూరు, మంగళగిరిపాడు, తురకపాలెం, సిరిపురం, డోకిపర్రులో ఇప్పటికే సీసీ రోడ్లు పూర్తి చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పల్లెల్లో రూ.8 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ చినుకుపడితే చాలు చెరువుల్లా మారే దారులతో ఇబ్బందిపడ్డామని ఈసారి సిమెంట్ రోడ్లపై రంగవల్లులతో సంక్రాంతిని జరుపుకుంటామని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పెదకూరపాడు నియోజవర్గంలో రూ.15 కోట్లతో పనులు జరుగుతున్నాయి. నెమలికల్లు నుంచి మండెపూడి రహదారిని రూ.2 కోట్లతో మొదలు పెట్టారు. కానీ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్నది స్థానికుల మాట. జలాలపురం నుంచి కంభంపాడు వరకు రూ.1.5కోట్లతో నిర్మాణం చేపట్టిన రహదారిలో ఓచోట కల్వర్టు కట్టాల్సి ఉన్నా తూములు వేసి సరిపెడుతున్నారు. రోడ్ల అంచులకు గ్రావెల్‌ తోలాల్సి ఉన్నా నల్లమట్టి పోసి సరి చేస్తున్నారు. అమరావతి మండలంలో గుంటూరు రహదారి నుంచి ఎనికేపాడు వరకు కోటి రూపాయలతో పనులు ప్రారంభించారు. కనీస ఎత్తు పెంచకుండానే రోడ్డు పనులు మొదలు పెట్టారు. దీని పరిశీలించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రమాణాలు పాటించాలని గుత్తేదారుకు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో గుత్తేదారు మళ్లీ పనులు మొదలు పెట్టారు.

ఆ గ్రామాలకు మంచిరోజులు - 685 పల్లెలకు తారు రోడ్లు

ఆ రోడ్డులో తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? - కాస్త ఆలోచించుకోవడమే బెటర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.