ఫోన్లు ట్యాపింగ్ పై టీడీపీ తీవ్ర ఆగ్రహం- ఈసీకి ఫిర్యాదు - TDP leaders phone tapping - TDP LEADERS PHONE TAPPING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 10:49 PM IST
TDP Leaders Complained to CEO About Phone Tapping : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నేతల ఫోన్లను జగన్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై తెలుగుదేశం నేతలు ఈసీకి ఫిర్యాదు చేసారు. కొందరు ఐపీఎస్లు ఈ తరహా అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ సీఈఓకి ఫిర్యాదు చేశామని నేతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో టీడీపీ నేతలపై నమోదు చేసిన కేసులు వివరాలు ఇవ్వాలని కోరినా పోలీస్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో డీజీపీ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైనా సీఈఓకు ఫిర్యాదు చేశామని నేతలు వెల్లడించారు.
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించేలా సీఎం జగన్ ఆదేశాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడైనా ఎన్నికల కోడ్ అమల్లోకివస్తే అవినీతి తగ్గాలి. కానీ రాష్ట్రంలో మాత్రం వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు కోడ్ను ఉల్లంఘించి అక్రమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు తమకు తాము తప్పించుకునే ప్రయత్నంచేస్తున్నారని విమర్శించారు. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా అక్రమ ఇసుక తవ్వకాలపై పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.