బొండా ఉమ అక్రమ అరెస్టుకు విజయవాడ సీపీ కుట్ర పన్నారు - ఈసీకి వర్ల రామయ్య లేఖ - Varla Ramaiah Letter to EC - VARLA RAMAIAH LETTER TO EC

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 7:04 PM IST

TDP Leader Varla Ramaiah Letter to Election Commission: ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందని ఎన్నికల కమిషన్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP politburo member Varla Ramaiah) లేఖ రాశారు. వైసీపీ అభ్యర్ధితో కుమ్మక్కై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమాను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసు కమిషనర్ కుట్ర పన్నారని వర్ల ఆరోపించారు. అరెస్ట్ చేసిన వ్యక్తుల వద్ద నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకుని బోండా ఉమాను అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. టీడీపీ నేత దుర్గారావుతో పాటు మరో 20 మంది మహిళలను అదుపులోకి తీసుకొని ఇప్పటి వరకు వారిని ప్రజల ముందు ప్రవేశపెట్టలేదని పేర్కొన్నారు. అరెస్ట్​ అయిన వారు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో తెలియదని వైసీపీ నాయకులతో పోలీసులు కుమ్మక్కై ఈ వ్యవహరంలో టీడీపీ నేతలను, సామాన్య ప్రజలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.