Woman Attempt Tried To Die After Being Cheated By YSRCP Leader : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నిన్న(ఆదివారం) విజయవాడలోని స్పా సెంటర్ పేరుతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంలో వైఎస్సార్సీపీ నేత, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ యువనేత తనను మోసం చేశాడని ఓ యువతి సెల్ఫీవీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంచలనంగా మారింది.
బాధితురాలి సెల్ఫీ వీడియో : వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అనుచరుడు అత్తర్ నాగూర్ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని బాధిత యువతి ఆరోపించింది. పెళ్లిని అడ్డుకుంటే తనతో పాటు కుటుంబసభ్యులను చంపేస్తానని బెదిరించాడని వాపోయింది. గతంలో కేసు పెడితే రిమాండ్ విధించారని, బెయిల్‌పై బయటకు వచ్చి బెదిరిస్తున్నట్లు పేర్కొంది. దీంతో గత్యంతరం లేక బాధితురాలు సెల్ఫీ వీడియో తీసి ఎలుకల మందు సేవించి ఆత్యహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి యువతిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతోంది.
'నేను భగ్న ప్రేమికుడిని' - ఫోన్ నంబర్ తీసుకుని ఏం చేస్తాడంటే!
పాత రూపాయి చూపిస్తే రూ.12 లక్షలు - ఆశకు పోయి రూ.2 లక్షలు పోగొట్టుకున్న వైనం