వారానికే పెద్దాపరేషన్ కుట్లు తీస్తారు - జగన్ 13 రోజులైనా బ్యాండేజ్ తీయలేదు: వర్ల రామయ్య - TDP Varla Ramaiah Fire on CM Jagan - TDP VARLA RAMAIAH FIRE ON CM JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 6:57 PM IST
TDP Leader Varla Ramaiah Fire on CM Jagan: ఐప్యాక్ సూచనలతో జగన్ డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మూడు రోజులకు తియ్యాల్సిన ప్లాస్టర్‌ను అలాగే ఉంచుకుని జగన్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. సెప్టిక్ అవుతుందని డాక్టర్లు అంటున్నా తనకు ఓట్లే ముఖ్యమన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళలకు పెద్దాపరేషన్ చేసిన వారానికే కుట్లు తీస్తారని, కానీ జగన్ గులకరాయి దెబ్బకు మాత్రం 13 రోజులైనా బ్యాండేజ్ తీయట్లేదని ధ్వజమెత్తారు. గొడ్డలి వేటు సూత్రధారిని అమాయకుడంటే రాష్ట్ర ప్రజలను కించపరచడమేనని, కడప ప్రజలను వంచించడమేనని వర్ల రామయ్య మండిపడ్డారు.
"ఐప్యాక్ సూచనలతో జగన్ డ్రామాలు ఆడుతున్నారు. గులకరాయి తగిలి 13 రోజులైనా బ్యాండేజ్ తీయలేదు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి జగన్ డ్రామా చేస్తున్నారు. మహిళలకు పెద్దాపరేషన్ చేసిన వారానికే కుట్లు తీస్తారు. గులకరాయి దెబ్బకు జగన్ 13 రోజులైనా బ్యాండేజ్ తీయలేదు. ఎక్కువ రోజులు బ్యాండేజ్ ఉంచుకుంటే సెప్టిక్ అవుతుందని డాక్టర్లు చెప్పినా జగన్ పట్టించుకోవట్లేదు. ఎంపీగా ఉన్న అవినాష్‌రెడ్డిని చిన్నపిల్లోడు అనడం ఏంటి?. గొడ్డలి వేటులో సూత్రదారి అమాయకుడు ఎలా అవుతాడు?. అవినాష్ అమాయకుడని చెప్పడం ప్రజలను వంచించడమే. 11 ఛార్జ్‌షీట్‌లు ఉన్న జగన్ కూడా అమాయకుడేనా?" - వర్ల రామయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు