జగన్‌ది రక్త చరిత్ర- వైఎస్సార్సీపీ పునాదులు రక్తంలో ఉన్నాయి: టీడీపీ నేత సయ్యద్ రఫీ - TDP Leader Syed Rafi PressMeet
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-03-2024/640-480-21000399-thumbnail-16x9-tdp-leader-syed-rafi-fire-on-cm-jagan.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 16, 2024, 5:20 PM IST
TDP Leader Syed Rafi Fire on CM Jagan : వైఎస్సార్సీపీ పునాదులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సొంత బాబాయి హత్య జరిగి ఐదేళ్లు పూర్తయిన ఇప్పటికి ఎటువంటి న్యాయం జరగలేదని మండిపడ్డారు. దర్యాప్తును ముందుకు సాగనివ్వకుండా జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అన్న మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు?.
జగన్ సొంత చిన్నమ్మ మంగళసూత్రానికే రక్షణ లేనప్పుడు, రాష్ట్ర ప్రజలకు ఎక్కడుటుందన్నారు. తన తప్పును తెలుసుకుని అఫ్రూవర్‌గా మారిన దస్తాగిరిని చంపేందుకు కుట్రలు చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా కోడికత్తి శ్రీనుని ఐదు సంవత్సరాలు జైలులో పెట్టారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి చరిత్ర మెుత్తం కూడా రక్త చరిత్రని విమర్శించారు. ఇప్పటికే టీడీపీ పార్టీ జగన్‌పై "జగనాసుర రక్తచరిత్ర" అనే పుస్తకం రాసిందని వెల్లడించారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్ చేసిన హత్యరాజకీయాల గురించి సొంత చెల్లెళ్లే నిన్న జరిగిన వివేకావర్థంతి కార్యక్రంలో చెప్పారని తెలిపారు. చివరికి వైసీపీకి ఓటు వేయ్యవద్దని సొంత కుటుంబ సభ్యులే చెబుతున్నారని తెలిపారు.