LIVE జగన్ విధ్వంసకర విధానాలతోనే పార్టీని వీడుతున్న నేతలు- టీడీపీ నేత రామచంద్రయ్య మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం - TDP leader live

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 3:30 PM IST

TDP leader Ramachandraiah media conference live: సీఎం జగన్​మోహన్​రెడ్డి నియోజకవర్గాల్లోని కీలక నేతల పనితీరు బాగోలేదంటూ మార్చేస్తున్నారు. వారి స్థానంలో మరో చోట కీలకమైన నేతలను ఆ స్థానాల్లోకి తీసుకొస్తున్నారు. వారు నెట్​వాచ్​మెన్​ తరహాలో ఏదో ఒక రకంగా నియోజకవర్గంలో నిలబడి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్​ వారినీ మార్చుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. అసలే క్షేత్రస్థాయిలో పూర్తి వ్యతిరేకత ఉన్న నేతలు ఏదోలా కష్టపడి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇన్​ఛార్జ్​ల మార్పు అంటూ 4 జాబితాల్లో 50 మందికి పైగా అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి మార్చేశారు. అయిష్టంగానైనా వారు ఆ స్థానాల్లో నిలదొక్కుకునేందుకు తంటాలు పడుతున్నారు. కానీ మీరంతా తాత్కాలికంగా పిచ్​ని కాపాడే నైట్ వాచ్​మెన్​లు మాత్రమే, ఇక ఔట్ అయిపోడంటూ జట్టు నాయకుడు ఒత్తిడి తెస్తున్నాడు. ఇక ఆ జట్టు క్లిష్ట పరిస్థితి, జట్టులో ఇతర సభ్యుల మానసిక స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా వైసీపీలో ఇమడ లేక పార్టీకి నాయకులు రాజీనామా చేస్తున్నారు. జగన్ విద్వేష, విధ్వంశకర విధానాలు నచ్చకే వైసీపీ ఖాళీ ఇవుతున్న సందర్భంగా టీడీపీ నేత సి రామచంద్రయ్య మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.