వైసీపీకి 25 సీట్లు కూడా రావు- జూన్ 4 ఫలితాలతో జగన్ ఆశలు ఆవిరి: రఘురామ - Raghu Rama Visit Tirumala temple
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 17, 2024, 3:22 PM IST
TDP Leader Raghu Rama Krishna Visited in Tirumala: ఎన్నికల్లో వైసీపీకి 25 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కవని ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ధీమా అంతా జూన్ 4న ఫలితాలు వెలువడ్డాక తలకిందులు అవుతుందని విమర్శించారు. మెజారిటీ స్థానాలలో కూటమి విజయం సాధించి అధికారంలోకి రాబోతుందని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ మూకల దాడిలో గాయపడిన పూలివర్తి నానిని గురువారం రఘురామ పరామర్శించారు. తిరుపతిలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. జూన్ 4వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నానిపై జరిగిన దాడిని ఆయన ఖండిస్తున్నామన్నారు. వైసీపీ ఓటమిని అంగీకరించినట్లుగా ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడిన సాయంత్రం నుంచి వైసీపీలో అంతర యుద్ధం మొదలవుతుందని రఘురామ వ్యాఖ్యానించారు.