LIVE: బ్యాంకులను మోసగించడానికి బరితెగించి జీవోలు విడుదల చేసిన జగన్ సర్కార్- టీడీపీ నేత పట్టాభి లైవ్ - TDP Leader Kommareddy Pattabhi Live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 10:13 AM IST
|Updated : Feb 15, 2024, 10:37 AM IST
TDP Leader Kommareddy Pattabhi Media Conference Live: బ్యాంకులను మోసగించడానికి బరితెగించి జగన్ సర్కార్ జీవోలు విడుదల చేసిందని టీడీపీ ఆరోపించింది. 'బ్యాంకులకు టోకరా' అనగానే విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ వంటి ఘరానా మోసగాళ్లు గుర్తుకొస్తారని అయితే సీఎం జగన్ దయ వల్ల ప్రభుత్వాలు కూడా బ్యాంకుల్ని మోసం చేయడాన్ని చూసే మహద్భాగ్యం మనకు కలగబోతోందని మండిపడ్డారు. అయిదేళ్లలో రాష్ట్ర ప్రతిష్ఠను జాతీయస్థాయిలో గంగలో కలిపిన జగన్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకుల్నే (AP Government Cheating Banks) బురిడీ కొట్టించిందన్న అపకీర్తినీ కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం గత ప్రభుత్వ తలపెట్టిన అపార్ట్‌మెంట్ టవర్ల నిర్మాణ పనుల్ని అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ నిలిపేసిన జగన్ సర్కార్, అవి పూర్తయినట్లుగా బ్యాంకుల కళ్లుగప్పాలని సీఆర్డీఏపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోందని తెలిపారు. దీనిపై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.