టీడీపీ నేత కిడ్నాప్ - ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు - TDP leader kidnapped - TDP LEADER KIDNAPPED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 17, 2024, 6:44 PM IST
TDP Leader Kidnapped in Chittoor District : చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ నేత కిడ్నాప్ కలకలం రేపుతోంది. తనను బలవంతంగా తీసుకెళ్లి బెదిరించారని తెలుగుదేశం కార్యకర్త హేమాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, నిత్యవసరాల కోసం దుకాణానికి వెళ్లిన తనను వైసీపీ నాయకుడు జానపద సృజనాత్మక కళల చైర్మన్ నాగభూషణం ఇంటికి కొంతమంది బలవతంగా తీసుకెళ్లారు. తెలుగుదేశం తరపున ప్రచారం చేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటావంటూ బెదిరించారు. అలాగే నా బట్టలు చించివేసి, హింసించి, నానా దుర్భషలాడి బలవంతంగా డ్రగ్స్ ప్యాకెట్లు ఉంచి ఫోటోలు తీశారని హేమాద్రి వెల్లడించారు.
అనంతరం కేసు పెడతామంటూ బెదిరించారని తెలిపారు. చివరికి ఎలాగోలా నాగభూషణం ఇంటి నుంచి తప్పించుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశానని తెలిపారు. అయితే హేమాద్రిని బలవంతంగా తీసుకెళ్లారన్న సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు నాగభూషణం ఇంటి వద్ద ఆందోళనకు దిగడంతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తత మారింది. ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.