కూటమి అధికారంలోకి రాగానే మెరుగైన సంక్షేమాన్ని అమలు చేస్తాం: గంటా శ్రీనివాసరావు - Ganta Election Campaign Visakha - GANTA ELECTION CAMPAIGN VISAKHA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 23, 2024, 4:27 PM IST
TDP Leader Ganta Srinivasarao Election Campaign: తెలుగుదేశం అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. విశాఖ జీవీఎంసీ 7వ వార్డులో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెరుగైన సంక్షేమాన్ని అమలు చేస్తామని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ ఐదు సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి అయినా చేసిందా అని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించలేకపోయిందని గంటా విమర్శించారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. గతంలో టీడీపీ ప్రభుత్వం డీఎస్సీ పేరుతో 20వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ నెరవేర్చిందిలేదని గంటా పేర్కొన్నారు. 99 శాతం హామీలు నెరవేర్చామని అబద్ధపు ప్రచారంతో ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.