దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మోదీ, చంద్రబాబును గెలిపించాలి : ఏలూరి సాంబశివరావు - TDP Leader Eluri Sambasivarao - TDP LEADER ELURI SAMBASIVARAO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 3:29 PM IST
TDP Leader Eluri Sambasivarao Election Campaign in Bapatla District : నవ్యాంధ్రలో పర్చూరు నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు శ్రమిస్తానని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. వలపర్ల ఆంజనేయస్వామి గుడి నుంచి ఏలూరి సాంబశివరావు, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి టి. కృష్ణప్రసాద్ తో కలసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత ఆంజనేయ స్వామివారి ఆలయంలో విశేష పూజలు చేసిన అనంతరం కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
సీఎం జగన్ ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఒక్క హామీ నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని ఏలూరి సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని టి. కృష్ణప్రసాద్ ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రం, దేశం అభ్యున్నతి పథంలో పయనించాలంటే మరోసారి చంద్రబాబు, మోదీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఏలూరికి కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలికారు.