జగన్ తాడేపల్లి ప్యాలెస్ కల్కి సినిమాలోని కాంప్లెక్స్ లాంటిది: డొక్కా - Dokka Varaprasad on Jagan - DOKKA VARAPRASAD ON JAGAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 3:42 PM IST

TDP Leader Dokka Manikya Varaprasad Allegations on Jagan: మాజీ సీఎం జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ కల్కి సినిమాలోని కాంప్లెక్స్ లాంటిదని టీడీపీ నేత నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శలు గుప్పించారు. కాంప్లెక్స్​లో కమాండర్​లా సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలు, కుతంత్రాలకు ప్రణాళికలు రచించారని డొక్కా చెప్పారు. జగన్ కాంప్లెక్స్​లో సుప్రీం లాంటివారని ఆయన అభివర్ణించారు. సుప్రీం కన్నా కనపడని శక్తి ప్యాలెస్​లో ఉందని ఆశక్తి ఆదేశాలతోనే కుట్రలు, కుతంత్రాలు అమలవుతున్నాయని అన్నారు. రాజధానిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై కాంప్లెక్స్​లో ఉండి సమాధానం ఇచ్చే కన్నా అసెంబ్లీకి వచ్చి సమాధానం చెబితే బాగుండేదన్నారు. ఐదు సంవత్సరాలు కాంప్లెక్స్ వీడని జగన్ రెండు గంటలసేపు ప్రెస్​మీట్ పెట్టి ఎప్పటి లాగానే అబద్దాలను చెప్పారని డొక్కా ఆరోపించారు. ఐదేళ్లలో వైఎస్సార్​సీపీ చేసిన ఘోరాలను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నామని డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.