LIVE: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మీడియా సమావేశం- ప్రత్యక్ష ప్రసారం - TDP Dhulipalla Narendra Live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 11:04 AM IST
|Updated : Feb 9, 2024, 11:22 AM IST
TDP Leader Dhulipalla Narendra Press Meet Live: రాష్ట్రంలో ధ్రుతరాష్ట్రుడి పాలన చూస్తున్నామని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ అండతోనే వైసీపీ నేతలు వందల అడుగుల లోతులో అక్రమంగా గ్రావెల్ తొవ్వుతూ నేలతల్లికి గర్భశోకాన్ని మిగులుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ యంత్రాలతో వందల అడుగుల లోతుకు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం సాక్షిగా ప్రభుత్వ సహకారంతో అడ్డగోలుగా తవ్వకాలు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
జనం మెచ్చిన పాలన చేశానని పదేపదే చెప్పే జగన్, సిట్టింగ్‌లకు అదే స్థానంలో టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. వైసీపీ నేతలను ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఆ పార్టీ ఓటమికి కారణాలుగా మారుతాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే యువతకు వైట్ కాలర్ ఉద్యోగాలు సాధ్యమని ధూళిపాళ్ల అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.