జగన్ అవినీతి, నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితి : దేవినేని ఉమ - Devineni Uma Comments on Jagan - DEVINENI UMA COMMENTS ON JAGAN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2024/640-480-21745726-thumbnail-16x9-devineni-uma-fires-on-jagan.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 19, 2024, 4:25 PM IST
|Updated : Jun 19, 2024, 5:07 PM IST
Devineni Uma Comments on Jagan : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. అవినీతి, నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితిలోకి వెళ్లిందని ధ్వజమెత్తారు. మంత్రులకు ప్రాజెక్టే అర్థం కాలేదని చెప్పడం దుర్మార్గమని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని విమర్శించారు. ఐదేళ్లలో ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదని దేవినేని ఉమామహేశ్వరరావు ఆక్షేపించారు.
Devineni Uma Tweet on Jagan : గత ప్రభుత్వం ప్రాజెక్టు కోసం కనీసం రక్షణ చర్యలు చేపట్టలేదని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అదేవిధంగా ఉన్న నిర్మాణాలను కూడా ధ్వంసం చేశారని మండిపడ్డారు. 2020లో డయాఫ్రం వాల్ దెబ్బతింటే నాలుగు సంవత్సరాలుగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని, అంతే తప్ప ప్రజా శ్రేయస్సును పట్టించుకోలేదని విమర్శించారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో మాట్లాడిన వీడియోను దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.