LIVE : రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై దేవినేని మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - TDP Leader Devineni Uma - TDP LEADER DEVINENI UMA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 20, 2024, 1:09 PM IST
|Updated : May 20, 2024, 1:20 PM IST
TDP Leader Devineni Uma Live On Violence in State : రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై టీడీపీ నేత దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని హింసాకాండపై ఈసీ వ్యవహరించిన తీరు సొరచేపల్ని పట్టుకుని చిన్న చేపల్ని వదిలేసినట్లుగా ఉందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. దాడులకు బాధ్యులుగా చూపించి కలెక్టర్లు, ఎస్పీలపై సస్పెన్షన్, బదిలీ వేటు వేసి కిందిస్థాయి అధికారులపై ఉదాసీనత చూపించారని ఆరోపించారు. అసలు హింసాకాండకు సహకరించిందే క్షేత్రస్థాయి సిబ్బంది, ఎమ్మెల్యేకు భద్రతా దళాల కదలికల సమాచారం చేరవేసి, కళ్లెదుట హింస జరుగుతున్నా పట్టించుకోకుండా చోద్యం చూశారని మండిపడ్డారు. అలాంటి వారిని వదిలేసి ఎక్కడో కార్యాలయాల్లో కూర్చేనే వారిపై చర్యలు తీసుకోవడం విస్మయం కలిగిస్తోందని తెలిపారు. హింసకు పేటెంట్ జగన్ రెడ్డి అందుకు ఆజ్యం పోస్తుంది సీఎస్ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ప్రస్తుతం ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి దేవినేని ఉమా మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : May 20, 2024, 1:20 PM IST