రూ.60 వేలు విలువ చేసే భూమిని 6 లక్షలుగా చెప్పుకుంటున్నారు- బాలినేనిపై దామచర్ల ఫైర్ - Damacharla Fires on Balineni
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 9, 2024, 8:03 PM IST
TDP Leader Damacharla Fires on YSRCP MLA Balineni : ఒంగోలులో 25 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే టీడీపీ నాయకులు కోర్టులో కేసు వేశారని, ఆరోపిస్తున్న బాలినేని శ్రీనివాస రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ (Damacharla Janardhan) ఆగ్రహం వ్యక్తం వేశారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో దామచర్ల విలేకరుల సమావేశం నిర్వహించారు. పలుసార్లు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని బాలినేని తీరును జనార్ధన్ ఖండించారు. ఇళ్ల పట్టాలు పై కేసు వేసింది ఎవరో తెలుసుకొని మాట్లాడాలని ఆయన అన్నారు. ఎవరో వేసిన వాటిని తెలుగుదేశం పార్టీ వాళ్లు వేశారని ఎలా మాట్లాడతారని ఆయన మండిపడ్డారు.
బాలినేని (Balineni) చేసే తప్పుడు పనుల్ని ఆపాలంటే ఎంతో సమయం పట్టదు అని కానీ మేము అన్నీ పట్టించుకోకుండా ఉన్నామని ఆయన చెప్పారు. పేదలకు ఇల్ల పట్టాలు ఇస్తున్న ప్లాటు ఒక సెంటు 60 వేలు విలువ చేసే ప్లాట్ అని వైఎస్సార్సీపీ (YSRCP) బాలినేని శ్రీనివాస రెడ్డి ఆరు లక్షలు అని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.