ఈసీని టీడీపీ ఏం కోరిందో తెలియకుండా వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడం సిగ్గుచేటు: అశోక్‌బాబు - Ashok Babu Comments YCP Complaints
🎬 Watch Now: Feature Video
TDP Leader Ashok Babu Fire On YSRCP Complaints: పోస్టల్ బ్యాలెట్‌లో 90 శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని సాధ్యమైనంత ఓట్లు తగ్గించేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర పన్నారని తెలుగుదేశం ఆరోపించింది. ఎన్నికల కమిషన్‌ను తెలుగుదేశం ఏం కోరిందో తెలుసుకోకుండా వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని ఆ పార్టీ నేత అశోక్‌బాబు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ 750 ఫిర్యాదులు చేస్తే కేవలం రెండింటికి మాత్రమే ఎన్నికల సంఘం నుంచి సమాధానం వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలని కోరినా చేయలేదని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌పై ఎన్నికల సంఘానికి తాము చేసిన ఫిర్యాదును వైఎస్సార్సీపీ నాయకులు తప్పుగా చిత్రీకరిస్తున్నారని అశోక్‌బాబు ధ్వజమెత్తారు.
పోస్టల్ బ్యాలెట్‌లో వైఎస్సార్సీపీకి తక్కువ ఓట్లు పడటంతోనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఓడిపోతున్న సంగతి వైఎస్సార్సీపీ నాయకులకు ముందే తెలిసిపోయింది కనుకే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అశోక్‌బాబు అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై 400కు పైగా కోర్టు కేసులున్నాయని, కోర్టులంటే వాళ్లకు లెక్కలేదని అశోక్‌బాబు దుయ్యబట్టారు. అనేక అంశాల్లో సుప్రీంకోర్టు సైతం వైఎస్సార్సీపీకి మొట్టికాయలు వేసిందని విమర్శించారు. రాష్ట్రానికి పట్టిన వైఎస్సార్సీపీ క్యాన్సర్‌కు మందు జూన్ 4న రానుందని హెచ్చరించారు.