వాలంటీర్ వేధింపులతో బాలిక ఆత్మహత్యాయత్నం - పరామర్శించిన టీడీపీ నేతలు - Volunteer harassment in Palapadu
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 8:06 PM IST
TDP Leader Aravind Babu Visited Minor Girl in Hospital: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో వాలంటీర్ శ్రీకాంత్‌రెడ్డి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు. అనంతరం చదలవాడ అరవిందబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి వాళ్లు వెళ్లే పరిస్థితిని కల్పించారన్నారు. ఇదే అదునుగా చేసుకుని కొందరు వాలంటీర్లు ఆయా గ్రామాల్లోని ఇళ్లల్లో ఉండే ఆడపిల్లలపై వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
అదేవిధంగా పాలపాడు గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి అనే వాలంటీర్ ఒక కుటుంబంలోని ఇద్దరు బాలికలను వేధింపులకు గురి చేశాడని దుయ్యబట్టారు. వాలంటీర్ వేధింపులకు తాళలేక తమ బిడ్డ చదువును మధ్యలోనే ఆపేసి బయటకు రానివ్వకుండా చేయడంతో బాలిక చెల్లెలుపై వాలంటీర్ వేధింపులకు పాల్పడటం దుర్మార్గపు చర్య అన్నారు. అతని వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్యకు యత్నించిందని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తరువాత ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఇలాంటి వారిపై దిశా, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అరవింద బాబు డిమాండ్ చేశారు.