LIVE: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన కూటమి 'జెండా' సభ- ప్రత్యక్షప్రసారం - TDP Jansena Meeting Live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 4:05 PM IST
|Updated : Feb 28, 2024, 8:09 PM IST
TDP Jansena Election Campaign Meeting at Tadepalligudem Live: తెలుగుదేశం- జనసేన కూటమి కలిసికట్టుగా తొలిసారి ప్రచార సమరశంఖం పూరించనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే సగానికిపైగా అభ్యర్థులను ప్రకటించి అధికారపార్టీకి సవాల్ విసిరిన కూటమి ఇప్పుడు ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణ ద్వారా శ్రేణులు కలిసి కదనరంగంలోకి దూకేలా దిశా నిర్దేశం చేయనున్నాయి.తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోబోయే ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఇరు పార్టీల శ్రేణులు తరలివచ్చారు. రెండు పార్టీల క్యాడర్‌ను రాజధాని స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కలిసి కదనరంగంలోకి దూకేలా సంసిద్ధం చేసే ప్రధాన లక్ష్యమే ఎజెండాగా ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ తొలి ఉమ్మడి సభకు 'జెండా' అనే పేరును ఖరారు చేశారు. ఉత్తరాంధ్ర వేదికగా జరిగిన నారా లోకేశ్ యువగళం- నవశకం ముగింపు సభలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలిసి పాల్గొన్నప్పటికీ, అభ్యర్థులను ప్రకటించాక ఎన్నికల ప్రచారం కోసం నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెం జెండా సభే. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో జెండా సభ ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Feb 28, 2024, 8:09 PM IST